
టాలీవుడ్‌లో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న పేరు ఇప్పుడు ఊహించని విధంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదానికి కారణం ఆయన స్నేహితుడిగా చెప్పుకునే ఉప్పలపాటి శ్రీనివాసరావు. రాజమౌళి టార్చర్ వల్ల సూసైడ్ చేసుకోబోతున్నట్లు అతను ఒక వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు 34 ఏళ్లుగా రాజమౌళితో స్నేహం ఉందని చెబుతున్నాడు.
Rajamouli
అంతే కాకుండా యమదొంగ (Yamadonga) సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశానని, కానీ తాను రాజమౌళి వల్లే జీవితంలో అన్ని కోల్పోయానని ఆరోపణలు చేస్తున్నాడు. అలాగే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి, లేఖను రాజమౌళి సన్నిహితులకు పంపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీనివాసరావు ఆరోపణల ప్రకారం, వ్యక్తిగత జీవితం నాశనమయ్యేందుకు రాజమౌళే కారణమని చెనుతూ.. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ తరువాత రాజమౌళి కూడా ఆ అమ్మాయిని లవ్ చేశాడు.
ట్రయాంగిల్ లవ్ స్టొరీ లాగా మారింది. దీంతో నన్ను రాజమౌళి త్యాగం చేయమని చెప్పాడు. దీంతో నేను ఏమి అనలేక కెరీర్ కోసం త్యాగం చేశాను.. అని తెలిపాడు. అంతేకాదు, రాజమౌళి జీవితాంతం ఎదగాలని తాను అనేక త్యాగాలు చేశానని, చివరకు తనను పూర్తిగా అణిచివేశారని అంటున్నాడు. ఇక ఈ విషయాలన్నీ ఎక్కడ బయటలు చెబుతానో అని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు అంటూ ఆ టార్చర్ తట్టుకోలేక ఇన్నాళ్లకు ఈ విషయాలు చనిపోవడానికి ముందు బయటకు చెబుతున్నానని అన్నారు. అంతే కాకుండా శ్రీనివాసరావు తన లేఖలో రాజమౌళిపై క్షుద్ర విద్య ఆరోపణలు చేశాడు.
ఇండస్ట్రీలో తాను ఎదగడానికి ఇతర దర్శకులను అడ్డుకునేందుకు జక్కన్న తాంత్రిక పూజలు చేశాడని, అందుకే నంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడని పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు మాత్రం ఈ ఆరోపణలను నమ్మలేకపోతున్నారు. మరి జక్కన్న దీనికి ఎలా స్పందిస్తాడు? ఈ ఆరోపణలు నిజంగా న్యాయస్థానానికి వెళతాయా? అన్నది చూడాలి.
వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు.
రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్.
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు.
సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా… pic.twitter.com/VKQT3AlfY3— ChotaNews App (@ChotaNewsApp) February 27, 2025