
ఇక ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళ్ ‘3’, తెలుగు ‘గబ్బర్‌సింగ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. చెన్నయ్‌లో ‘3’కి డబ్బింగ్ చెప్పి, ‘గబ్బర్‌సింగ్’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆమె ముంబయ్ వెళ్లారు. ఒకవేపు షూటింగ్స్‌లో పాల్గొనడం మరోవేపు డబ్బింగ్ చెప్పడం ఒక ఎత్తయితే లగేజీ సర్దుకోవడం మరో సమస్య అవుతోందని ట్వీట్ చేసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ‘ప్యాకింగ్ కంపెనీ’ ఆరంభిస్తే బాగుంటుందేమో అని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశింది. శ్రుతి ట్విట్టర్‌కి రెండు లక్షల పై చిలుకు ఫాలోయర్స్ ఉన్నారు. ఇంతమంది తనను అభిమానంగా ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.