March 17, 202501:33:03 AM

మహేశ్‌కు ఐర్లాండ్‌లోనూ క్రేజే !

ఓవర్సీస్‌లో తిరుగులేని సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న మహేశ్ జనాకర్షణ శక్తి కూడా అందుకు తగ్గట్లే విస్తరిస్తోంది. ఇప్పటివరకూ ఓవర్సీస్‌లో అత్యధిక గ్రాస్ వసూలు చేసింది ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'దూకుడు' సినిమాలే. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న '1.. నేనొక్కడినే' సినిమా షూటింగ్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరంలో జరుగుతోంది. మహేశ్‌పై అక్కడి వీధుల్లో దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఊహించని రీతిలో అక్కడి తెలుగువాళ్లు కొంతమంది మహేశ్‌ని చుట్టుముట్టి ప్రశంసల్లో ముంచెత్తడమే కాకుండా, ఆయన ఆటోగ్రాఫ్ అడిగారు. అందుకు మహేశ్ ఏమాత్రం అభ్యంతరపెట్టకుండా వాళ్లకి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడమే కాకుండా ఫొటోలు కూడా దిగారు. ఈ ఉదంతం మన టాలీవుడ్ ఖ్యాతి ఎంతగా విస్తరించిందనే దానికి నిదర్శనమని సినీ వర్గాలు అంటున్నాయి. '1' సినిమా యూనిట్ జూలై వరకు యూరప్‌లో షెడ్యూల్ నిర్వహించి, ఆగస్టులో హైదరాబాద్‌కు తిరిగి రానున్నది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మహేశ్ సరసన మోడల్ కృతి సనన్ నాయికగా పరిచయమవుతోంది.

Tags: News, Telugu News, Andhra Pradesh News
Labels:

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.