హెలికాప్టర్ మృతులకు రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ, జూన్ 26 : ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) సిబ్బందికి  బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. విధుల్లో భాగంగా మృతి చెందిన ఐఏఎఫ్ అధికారులు నిజమైన హీరోలని కీర్తించారు.

వారి ధైర్యసాహసాలను సెల్యూట్ చేస్తున్నానని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనీకి పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులందరినీ తరలించేందుకు ఆర్మీ చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఉత్తరాఖండ్‌లో మంగళవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 20 మంది దుర్మరణంంచెందిన విషయం తెలిసిందే.


Tags: News, Telugu News, Andhra News
Labels: ,

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.