నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం భారి స్తాయిలో, భారి బడ్జెట్ తో
రూపొందుతున్న చిత్రం లెజెండ్ . బోయపాటి శ్రీను దర్శకత్వం లో 14 రీల్స్
పాతాకం పై రూపొందుతున్న ఈ చిత్రం ఇటివలే బ్యాంకాక్ లో షూటింగ్ చేసుకుని
తిరిగి వచ్చింది . ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా
ఎదురుచూస్తున్నారు . సింహా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన
కాంబినేషన్లో వస్తున్న లెజెండ్ సినిమా పై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి . ఈ
సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉంటాయని చిత్ర యూనిట్
చెబుతోంది. ఈ సినిమాతో బాలయ్య పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే వార్తలు
వస్తున్నాయి . అయితే ఈ చిత్రాన్ని మర్చి చివరి వారం లో విడుదలకు సన్నాహాలు
చేస్తున్నారు . ఈ ఆడియో ను మర్చి మొదటి వారం లో చేయడానికి ప్లాన్స్
జరుగుతున్నాయని సమాచారం . ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మొదటి సారిగా
బాలయ్య సినిమాకు సంగీతం అందిస్తుండడం తో ఈ ఆడియో పై కూడా భారి అంచనాలే
ఉన్నాయి మరి !
లెజెండ్ పాటల ముహూర్తం కుదిరింది!
07Mar2014