రచయిత శ్రీనివాస చక్రవర్తి మరణం దయనీయం.
"జగదేక వీరుడు అతిలోక సుందరి" కథా రచయిత శ్రీనివస చక్రవర్తి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ అనాధలా మరణించారు. రెండు రోజుల క్రితం సినీ పరిశ్రమలోని వారికి తెలిసే సరికే ఆయన స్పృహ కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు.దాసరిగారికి ఎవరో తెలియజేస్తే ఆయన నాకు కాల్ చేసారు.వెనువెంటనే మొన్న రచయితల సంఘానికి నేను తెలియజేయగానే వారి ట్రెజరర్ కాకర్లగారు గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళారు.ఆయన్ని పదిరోజుల క్రితమే సూర్యా పేపర్లో పనిచేసే వెంకట్ అనే రిపోర్టర్ ఇక్కడ జాయిన్ చేసారని,అక్కడ ఆయనకు సేవలు చేస్తున్న వెంకట్‌రెడ్డి అనే సహాయ దర్శకుడు వివరాలు తెలీయజేసాడు.చికిత్స చేస్తున్నరు గానీ ఇక కష్టం అంటున్నారని వెంకట్‌రెడ్డి తెలియజేశాడు.నిర్మాత రామలింగేశ్వర్రవుగారికి నేను చెప్పగానే పాపం ఎవరూ లేరు ఏదైనా వుంటే మనం చేదాం అని ఆయన అన్నారు.ఇంతలోనే ఈ వార్త తెలియడం..ఆయన కుటుంబ సభ్యులెవరో రావడం..వెనువెంటనే బన్సీలాల్‌పేటలో ఉదయమే అంత్యక్రియలు జరిగిపోవడం బాధకలిగించే విషయం.సమాచారం అందగానే కాకర్లగారు అంత్యక్రియల కార్యక్రమానికి చేరుకోగలిగారు.వెల్ళి చూద్దాం అనుకున్న వారికి కడసారి చూపు కూడా మిగలలేదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..అశ్రు నివాళి.