Ananya Nagalla, Venu Swamy: అనన్య నాగళ్లతో వేణు స్వామి పూజలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

అనన్య నాగళ్ళ (Ananya Nagalla) , ధనుష్ రఘుముద్రి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘తంత్ర’. సలోని, ‘టెంపర్’ వంశీ, మీసాల లక్ష్మణ్ (ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్) కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ‘ఫస్ట్ కాపీ మూవీస్’, ‘బి ద వే ఫిల్మ్స్’ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మించారు. శ్రీనివాస్ గోపిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు.క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది. టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే.. హర్రర్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయి అని స్పష్టమవుతుంది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా సక్సెస్ పై అనన్య నాగళ్ళ చాలా హోప్స్ పెట్టుకున్నట్లు ఉంది. ఎందుకంటే  (Vakeel Saab) ‘వకీల్ సాబ్’ తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించింది కానీ ఏదీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ సినిమా చేసింది. ఈ సినిమా సక్సెస్ కోసం అనన్య నాగళ్ళ.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. అవును.. ఓ గుడిలో అనన్య.. వేణు స్వామి చెప్పిన పూజలు ఆచరిస్తున్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి చెప్పే జ్యోతిష్యం నిజమవుతుంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు, లేదు అదంతా పక్కదోవ పట్టించడానికే అని చెప్పే వాళ్ళు ఉన్నారు. (Dimple Hayathi) డింపుల్ హయతి, (Nidhhi Agerwal) నిధి అగర్వాల్, (Inaya Sultana) ఇనయ సుల్తానా వంటి హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు. ఇప్పుడు అనన్య నాగళ్ళ కూడా ఆ లిస్టులో చేరినట్టు అయ్యింది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.