March 16, 202508:03:30 AM

Dil Raju, Vaishnavi Chaitanya: బేబీ’ హీరోయిన్ తో కలిసి పాట పాడిన దిల్ రాజు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో ఎక్కువ హిట్ సినిమాలు తీసిన నిర్మాతగా టాప్ ప్లేస్ లో నిలిచారు. అంతేకాదు ఈయన ఏ సినిమా తీసినా మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం జనాల్లో ఉంటుంది. అలాగే వేరే సినిమాల నిర్మాతలు, దర్శకులు కూడా దిల్ రాజుకి స్పెషల్ గా షో వేసి చూపించి.. ఏమైనా కత్తిరింపులు గట్రా వంటి సలహాలు చెప్పమని కోరుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దిల్ రాజుకి ఉండే గౌరవం అలాంటిది.

ఇదంతా ఒక వైపు.. మరోవైపు దిల్ రాజుని తిట్టుకునే బ్యాచ్ కూడా ఉంటారు. ఇంకో వైపు దిల్ రాజు పై మీమ్స్ వేసే బ్యాచ్ కూడా ఉంటారు. దిల్ రాజు పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలని.. ఈ బ్యాచ్ వైరల్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు కూడా దిల్ రాజుకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) మూడో సినిమాగా ‘లవ్ మీ’ (Love Me) అనే మూవీ తెరకెక్కుతుంది. అరుణ్ భీమవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సంగీత దర్శకుడు. ఏప్రిల్ 25 న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను ఈరోజు నుండి మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ అయిన ‘రావాలి రా’ అనే పాటను విడుదల చేశారు.

ఈ వేడుకలో హీరోయిన్ వైష్ణవి చైతన్యతో (Vaishnavi Chaitanya కలిసి దిల్ రాజు ఆ పాటను పాడటం జరిగింది. మొన్నటికి మొన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమాలోని ‘జరగండి’ పాటకి దిల్ రాజు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా దిల్ రాజు ఆ పాటకి స్టేజిపై డాన్స్ చేశారు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.