Family Star Movie: ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా నిజ జీవిత కథనా? విజయ్‌ ఏమన్నాడంటే?

‘ఏవండీ..’ అంటూ టీజర్‌లో ఓ చిన్న డైలాగ్‌ పెట్టి మొత్తం యువతను సినిమా వైపు తిప్పేసుకున్నాడు ‘ఫ్యామిలీ స్టార్‌’(Family Star). విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) – మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur)  మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ ఓ లెవల్‌లో ఉంటుంది. అని అప్పుడే అర్థమైపోయింది. ఆ తర్వాత ట్రైలర్లు వచ్చాక ఇంకా అర్థమైపోయింది. భలేగా ఉందే కదా… అంటూ సినిమా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ ఓ వ్యక్తి జీవితం నుండి తీసుకున్నవి అంటున్నారు.

‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అని, ఇలాంటి కథలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ చెప్పాడు. అంతే కాదు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా కథ పరశురామ్‌ రాశారని విజయ్‌ దేవరకొండ చెప్పాడు. ఆ విషయాలు విన్నప్పుడు హీరో పాత్ర నిజ జీవితానికి దగ్గర ఉందని అనిపించిందని విజయ్‌ దేవరకొండ చెప్పాడు. అయితే ఏ సన్నివేశాలు నిజ జీవితం నుండి తీసుకున్నారు అనేది చూడాలి.

సగటు మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ఇప్పటికే టీమ్‌ చెప్పేసింది. ప్రచార చిత్రాల్లో సన్నివేశాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ మాటలు వింటుంటే… పరశురామ్‌ (Parasuram)  జీవితంలో సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి అంటే మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్‌ టీమ్‌ ప్రశంసలతో ముంచెత్తింది అని చెబుతున్నారు.

కుటుంబ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు ప్రతి ఇంట్లో జరిగినట్లుగా అనిపిస్తాయి అని కూడా అంటున్నారు. ఆ సంగతేంటో ఇప్పుడు చూడాలి. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్‌ 5న విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.