Family Star: ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్  (Family Star) రిలీజ్ కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ కు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉందని సమాచారం అందుతోంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి మేకర్స్ ను ఎంతగానో ప్రశంసించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండకు ప్రస్తుతం సక్సెస్ దక్కడం ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ మూవీ ఆ లోటును తీర్చేలా ఉంది.

ఫ్యామిలీ స్టార్ సినిమాలో రోహిణి హట్టంఘడి (Rohini Hattangadi) కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయగా ఈ సినిమా ట్రైలర్ లో ఆ ఖర్చు కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ సమ్మర్ ను ఈ సినిమా ఊహించని స్థాయిలో క్యాష్ చేసుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ దేవరకొండ పారితోషికం భారీ రేంజ్ లో ఉంది.

విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. దిల్ రాజు ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్ గా వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఖుషి (Kushi) తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. విజయ్ దేవరకొండ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.