Ivana: ఇప్పుడు ‘లవ్ టుడే’ బ్యూటీ పరిస్థితేంటి?

దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) అందరికీ సుపరిచితమే.‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతను.. తొలి సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఆ సినిమాలో హీరోయిన్ కావడం దిల్ రాజు నిర్మాత కావడం, ‘హుషారు’ (Hushaaru) ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకుడు కావడంతో ఆ సినిమా ఎంతో కొంత బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడానికి కలిసొచ్చినట్టు అయ్యింది.కానీ నటుడిగా ఆశిష్ ప్రేక్షకులతో పాస్ మార్కులు వేయించుకుంది అంటూ ఏమీ లేదు.

పెద్ద నిర్మాత కొడుకు కాబట్టి.. వెంటనే ‘సెల్ఫిష్’ (Selfish) అనే సినిమా సెట్ అయ్యింది. ‘లవ్ టుడే’ (Love Today) ఫేమ్ ఇవానాని (Ivana) హీరోయిన్ గా తీసుకున్నారు. షూటింగ్ మొదలైంది. కాశి విశాల్ (Kasi Vishal) ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ (Sukumar) కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. కానీ ఎందుకో ఈ సినిమాని పక్కన పెట్టేసి ‘లవ్ మి’ (Love Me) అనే సినిమాని మొదలుపెట్టాడు ఆశిష్.

‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. అరుణ్ భీమవరపు (Arun Bhimavarapu) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 25న రిలీజ్ అని కూడా ప్రకటించేశారు. ఇది ముందు వస్తుంది అంటే.. మరి ‘సెల్ఫిష్’ సంగతేంటి? ఆ సినిమాని పక్కన పెట్టేశారా? సినిమా అనుకున్నట్టు రాకపోవడం వల్లనే పక్కన పెట్టేసారు అంటూ కొంత టాక్ అయితే వినిపిస్తుంది.

అయితే ఈ సినిమా కంప్లీట్ అయినా.. ఆగిపోయినా.. ఆశిష్ కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అంతా హీరోయిన్ ఇవానాకే అని చెప్పాలి. ఎందుకంటే ‘సెల్ఫిష్’ కంప్లీట్ అయితేనే కానీ ఆమె తెలుగులో మరో సినిమా చేయడానికి వీల్లేదు అంటూ అగ్రిమెంట్ చేసుకున్నారట.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.