Jayalalitha, Sobhan Babu: శరత్ బాబు పై సీనియర్ నటి జయలలిత షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి జయలలిత (Jayalalita) అందరికీ సుపరిచితమే. క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ వ్యాంప్ పాత్రలతో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఈమె అనేక సినిమాల్లో నటించింది. కామెడీ రోల్స్, విలన్ రోల్స్, వ్యాంప్ రోల్స్, ఐటమ్ సాంగ్స్.. ఇలా అన్ని రకాల పాత్రలు చేసి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు సీరియల్స్ లో నటించారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత ‘రుద్రం కోట’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు జయలలిత.

కానీ ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఇదిలా ఉంటే… జయలలిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దివంగత నటుడు (Sarath Babu) శరత్ బాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. జయలలిత మాట్లాడుతూ.. ” శరత్ బాబుని నేను ప్రేమించాను. వయసు వచ్చినప్పుడు ఒక తోడు కావాలనిపిస్తుంది. ఆ టైంలో నాకు శరత్ బాబు, నేను ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకున్నాం. ఆయన్ని నేను బావా అని పిలుస్తుండేదాన్ని.మేము కలిసి చాలా యాత్రలు చేశాం.

ఇప్పుడు ఆయన లేరు కాబట్టి చెబుతున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం.బిడ్డను కూడా కనాలని అనుకున్నాం. కానీ ఇండస్ట్రీ వాళ్ళు అడ్డుపడ్డారు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జయలలిత. శరత్ బాబు సీనియర్ నటి (Rama Prabha) రమాప్రభ..ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్నాళ్ళకి వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత శరత్ బాబు జయలలితతో ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న వీరికి అడ్డుపడింది ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే..!

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.