Kamal Haasan, Ilaiyaraaja: ఇళయరాజా కోసం కమల్‌ భారీ సాయం… ఏం చేస్తున్నాడంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతోంది. సినిమాల్లో తిరుగులేని సంగీత దర్శకుడిగా పేరొందిన ఆయన పాత్రలో సినిమాలో ధనుష్‌ (Dhanush) నటించబోతున్నాడు. అరుణ్‌ మాథేశ్వరన్‌ (Arun Matheswaran) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో కథానాయకుడు కమల్‌ హాసన్‌ కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో నిజ జీవిత పాత్రలో తళుక్కున మెరవబోతున్నారట. దాంతోపాటు సినిమా రచనలో కూడా భాగమవుతున్నారట.

ఇప్పటికే దర్శకుడు అరుణ్‌తో కలసి కమల్‌ హాసన్‌ (Kamal Haasan) స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఇళయరాజాపై తనకున్న అభిమానంతోనే కమల్‌ ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్‌ లాంటి మరికొందరు అగ్ర తారలు కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారట. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట. అయితే నటించేది ఎక్కువగా సౌత్‌ నటులే ఉంటారు అని చెబుతున్నారు. మరి ఉత్తరాది నుండి ఎవరు ఉంటారు అనేది చూడాలి.

అయితే.. ఈ సినిమా ద్వారా ఇళయరాజాకు ఏ మేరకు పారితోషికం ముడుతుంది అనే చర్చ మొదలైంది. త‌న పాట‌లు ఇత‌ర మీడియాలో వ‌చ్చినా, బ‌హిరంగంగా వేదిక‌ల‌పై పాడినా త‌న‌కు రాయ‌ల్టీ వ‌చ్చేలా ఓ సిస్ట‌మ్ ఏర్పాటు చేసుకున్నారు ఇళయరాజా. ఈ నేపథ్యంలో ఆయన జీవితంతో తీస్తున్న సినిమాకు ఎంత తీసుకుంటున్నారు అనేది ఓ ప్రశ్నగా మారింది. ఇళ‌య‌రాజా సినిమాకు వ‌చ్చిన లాభాల్లో 30 శాతం ఇళయరాజాకు రాయ‌ల్టీ రూపంలో చెల్లించ‌బోతున్నార‌ట.

అంటే ఈ సినిమాకు రూ. 100 కోట్లు లాభం వ‌స్తే.. ఇళ‌య‌రాజాకు రూ. 30 కోట్లు వస్తాయని చెప్పొచ్చు. ఇదే నిజమైతే ఓ బ‌యోపిక్‌కు రాయ‌ల్టీ రూపంలో ఎక్కువ మొత్తం అందుకున్న క‌ళాకారుడిగా ఇళ‌య‌రాజా చ‌రిత్ర సృష్టించిన‌ట్టే అంటున్నారు. అన్నట్లు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా ఇళయరాజే వహిస్తున్నారు. మరి దానికి వేరే పారితోషికం తీసుకుంటారా లేదా అందులో కలిపే ఉంటుందా అనేది చూడాలి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.