Ram Charan: రాంచరణ్ 16వ సినిమా.. అభిమానులకు ఇది గుడ్ న్యూసే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్(Ram Charan).. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి వైజాగ్లో ఓ షెడ్యూల్ నడుస్తుంది. రేపటికి అంటే మార్చి 19 కి ఆ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మార్చి 21 నుండి హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ మొదలవుతుంది. ఇక ఈ సినిమా కంప్లీట్ అయ్యాక.. రాంచరణ్, ‘ఉప్పెన’ (Uppena) దర్శకుడు బుచ్చిబాబుతో (Buchi Babu) ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎంపికైంది. ఈ ప్రాజెక్టుపై రాంచరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేది ఇన్సైడ్ టాక్. ఎంత కాన్ఫిడెన్స్ అంటే.. (ఈ మాట గుర్తుపెట్టుకోండి) బుచ్చిబాబుతో చేయబోయే సినిమాలోని తన పాత్రకి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనేంత కాన్ఫిడెన్స్ తో చరణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే శంకర్ తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి..

బుచ్చిబాబుతో చేయాల్సిన ప్రాజెక్టు డిలే అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి లేదు. మార్చి 20 న రాంచరణ్- బుచ్చిబాబు..ల సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు..నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు..! వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది అని కూడా సమాచారం. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు అనే సంగతి తెలిసిందే.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.