Ram Charan Remuneration: రెమ్యునరేషన్ విషయంలో తెలివిగా అడుగులేస్తున్న చరణ్.. ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ రెమ్యునరేషన్ విషయంలో మరీ పట్టింపులకు పోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాకు పరిమితంగానే పారితోషికం తీసుకున్న రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాకు మాత్రం 80 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రెమ్యునరేషన్ విషయంలో చరణ్ తెలివిగా అడుగులు వేస్తున్నారు. తన పారితోషికం నిర్మాతకు భారం కాకుండా రామ్ చరణ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా స్పష్టత మాత్రం రావాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఇతర భాషల నటులకు కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఛాన్స్ దక్కుతోందని తెలుస్తోంది. ఉప్పెన తర్వాత వేర్వేరు కారణాల వల్ల బుచ్చిబాబు సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథతోనే బుచ్చిబాబు చరణ్ తో సినిమా తీస్తున్నారని సమాచారం అందుతోంది.

చరణ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తారని కథనం విషయంలో సుకుమార్ కూడా ఈ సినిమాకు కొంతమేర సహాయం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి ఈ సినిమాను మొదలుపెట్టాలని చరణ్ భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడటం కూడా బుచ్చిబాబు సినిమాపై కొంతమేర ప్రభావం చూపుతోంది.

అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. (Ram Charan) చరణ్, శంకర్, దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.