March 16, 202510:12:42 PM

Shiva Rajkumar: ‘RC16’ లో తన పాత్ర గురించి రివీల్ చేసిన శివన్న..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. కాదు కాదు గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. అతని నెక్స్ట్ మూవీ కోసం దేశ,విదేశాల్లోని సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాంచరణ్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దిల్ రాజు కెరీర్లో ఇది 50వ సినిమా. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి.. ఆయన ఎక్కడా రాజీపడటం లేదు. 2024 లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇది కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రాంచరణ్. ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

అలాగే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ను తీసుకున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రాంచరణ్ – బుచ్చిబాబు (Buchi Babu) ..ల ప్రాజెక్టు పై స్పందించారు. ఈ సినిమాలో తాను ఓ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్టు అలాగే, ఆ పాత్రని బుచ్చిబాబు డిజైన్ చేసిన తీరు కూడా అద్భుతంగా ఉన్నట్లు,వినగానే మైండ్ బ్లాక్ అయినట్టు.. ఆయన ప్రశంసించారు. అలాగే చాలా లేయర్స్ ఉన్న క్యారెక్టర్ అది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.