Sree Vishnu: చెప్పాపెట్టకుండా హీరోయిన్‌ వెళ్లిపోయిందట… శ్రీవిష్ణు ఎవరి గురించి అన్నాడో!

కొన్ని సినిమాలు కంటెంట్‌ ప్రధానంగా సాగినా.. అందులో ప్రధాన పాత్రధారి భలే ఆకట్టుకుంటాడు. అంతర్లీనంగా అతని పాత్ర, పాత్ర చిత్రణ, యాటిట్యూడ్‌, కామెడీ టైమింగ్‌లో మెరుపులు… ఇలా అన్నీ భలే అనిపిస్తుంటాయి. అలాంటి వారిలో శ్రీవిష్ణు (Sree Vishnu) ఒకరు. ఇప్పుడు ఆయన ‘బ్రోచేవారేవారురా’ (Brochevarevarura)  లాంటి క్రేజీ హిట్ తర్వాత ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణతో (Rahul Ramakrishna) కలసి వస్తున్నారు. అదే ‘ఓం భీమ్ బుష్’(Om Bheem Bush). ‘హుషారు’ (Husharu) లాంటి యూత్‌ ఫుల్‌ మూవీ తీసిన శ్రీ హర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీ విష్ణు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘ఓమ్ భీమ్ బుష్’ అనే పేరు వినగానే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది ఏంటి సంగతి అని అడిగితే.. ఆ సినిమా టైటిల్ సజెస్ట్ చేసింది నేనే అని చెప్పారు. అందరికీ నచ్చడంతో అదే ఓకే చేశాం అని చెప్పారు. ఈ సినిమా చేసేటప్పుడు ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ డేట్స్ క్లాష్‌ అయ్యాయని, ఆ తర్వాత హీరోయిన్ల డేట్స్‌తో క్లాష్‌ వచ్చింది వచ్చింది అని సినిమా కష్టాలు చెప్పాడు శ్రీ విష్ణు.

సినిమాలో కొత్త వాళ్లనే తీసుకోవడానికి డేట్స్‌ క్లాష్‌ రాకూడదనేదే కారణం అని చెప్పాడు. అయితే సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి తాము ముగ్గురం తప్పా అందరూ బిజీ అయిపోయారు అని చెప్పారు. ఇంకొంతమంది ఫేమస్ అయిపోయారు అని అన్నాడు. ఒక హీరోయిన్ అయితే టీమ్‌కి చెప్పకుండా బిగ్ బాస్‌కి వెళ్లిపోయింది అని చెప్పాడు. దీంతో కాస్త ఇబ్బంది పడినట్లు తెలిపాడు.

అయితే ఆ హీరోయిన్‌ ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పలేదు. అయితే టీమ్‌ను చూస్తే… శ్రీ విష్ణు చెప్పింది ఆయేషా ఖాన్‌ గురించే అని అర్థమవుతోంది. ఎందుకంటే ఆమెనే హిందీ బిగ్‌ బాస్‌లోకి వెళ్లింది. షూటింగ్ ఎలా అయ్యింది, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయం చెప్పడానికి ఈ ఒక్క పాయింట్ చాలు అని నెటిజన్లు అంటున్నారు.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.