Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా?

(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది. టిల్లు స్క్వేర్ కు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ కావచ్చనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రేంజ్ లో ఖర్చు చేసినట్టు సమాచారం అందుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని సమ్మర్ సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకోనుందని తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ టాక్ ను బట్టి టిల్లు స్క్వేర్ తర్వాత రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో ఒక అంచనాలకు రావచ్చు.

టిల్లు స్క్వేర్ సినిమా టాక్ విషయంలో మేకర్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పాత్రకు సంబంధించిన ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా అంచనాలకు మించి ఉందని సీక్వెల్ సెంటిమెంట్ ను ఈ సినిమా విజయవంతంగా బ్రేక్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టిల్లు స్క్వేర్ కు కూడా సీక్వెల్ ఉండబోతుందని సమాచారం అందుతోంది.

సాంగ్స్, బీజీఎం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయంటూ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టిల్లు స్క్వేర్ సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. టిల్లు స్క్వేర్ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరగగా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.