March 16, 202510:12:45 PM

Ustaad Bhagat Singh: ఉస్తాద్ టీజర్ మాత్రమే కాదు ఓజీ గ్లింప్ల్స్ కూడా… ట్వీట్ తో క్లారిటీ వచ్చిందిగా!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)   సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతుండగా ఈ నెల 19వ తేదీన ఉస్తాద్ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం. పొలిటికల్ డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ ఉండబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మేకర్స్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను పంచుకుంటూ ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్నారు. అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్ లో ఈ వీడియోను ప్లే చేయనున్నారని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయని కూడా ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అప్ డేట్ వస్తుందనే వార్త అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

మరోవైపు ఓజీ (OG) సినిమా గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) అప్డేట్ ఇచ్చారు. ఓజీ మూవీ నుంచి కూడా గ్లింప్స్ రిలీజ్ కానుందని ఆయన వెల్లడించారు. ఈ గ్లింప్స్ పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోనా? లేక ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. నేను ఏ విషయాలు చెప్పనని అయితే త్వరలో గ్లింప్స్ రిలీజ్ కానుందని ఇమ్రాన్ హష్మీ పేర్కొన్నారు.

ఓజీ మూవీ నుంచి మరో గ్లింప్స్ రిలీజైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పవన్ సినిమాల నుంచి వరుస అప్ డేట్స్ వస్తుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదల కానుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని ఈ సినిమాలు పవన్ ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచుతాయని అభిమానులు భావిస్తున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.