‘ఇండియన్ 2’ ‘కల్కి’ ‘పుష్ప 2’.. ఇది కదా మాస్ అంటే..!

అదేంటో కానీ.. 2023 సమ్మర్లో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) నటించిన ‘విరూపాక్ష’ (Virupaksha) , నాని (Nani) ‘దసరా'(Dasara) , రవితేజ (Ravi Teja) ‘రావణాసుర’ (Ravanasura) వంటి మిడ్ రేంజ్ సినిమాలు మినహా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యింది లేదు. గోపీచంద్ (Gopichand) ‘రామబాణం'(Ramabanam) , అఖిల్ (Akhil Akkineni) ‘ఏజెంట్’ (Agent) వంటి సినిమాలు ఆడలేదు. సో ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు  (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (Jr NTR)  వంటి బడా హీరోల సినిమాలు లేక 2023 సమ్మర్ చాలా డల్ గా సాగింది.

అయితే ఇప్పుడు 2024 సమ్మర్ మరింత డల్ గా సాగుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) మినహా క్రేజీ సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. రాబోయేవి అన్నీ చిన్న సినిమాలు. మే 13న ఎన్నికలు జరగనుండటంతో జనాలకి కూడా థియేటర్లకు వచ్చే మూడ్ లేనట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అసలుసిసలైన సినిమా పండుగ అంతా జూన్ నుండి మొదలు కాబోతుంది. జూన్ నెలలో శంకర్ (Shankar) – కమల్ హాసన్ (Kamal Haasan) ..ల ‘ఇండియన్ 2’ (Inidan2) (భారతీయుడు 2) రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ తర్వాత జూలై నెలలో ‘కల్కి 2898 ‘ (Kalki 2898 AD) రిలీజ్ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆగస్టులో ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) రాబోతుంది. దాని పై ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG Movie) వస్తుంది. అక్టోబర్ లో ‘దేవర’ (Devara) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి సినిమాలు వస్తాయి. సో జూన్ నుండి సినీ ప్రియులకి అసలైన పండుగ మొదలుకాబోతుందన్న మాట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.