Anupama , Sai Sreenivas: లిల్లీ అప్పుడు చీరలో… మరి ఈ సారి ఎలా కనిపిస్తుందో?

ఇప్పుడంటే హాట్‌ లేడీ అయితపోయి కుర్రకారు గుండెల్లి గుచ్చి గుచ్చి తీపి గాయం చేసింది కానీ.. ఒకప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) అంటే చీరకట్టుకు, హోమ్లీ లుక్‌కి ఫేమస్‌. ఆమె అదిరిపోయే చీరకట్టులో కనిపించిన సినిమాల్లో ‘రాక్షసుడు’ (Rakshasudu) ఒకటి. ఆ సినిమలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) సరసన అదిరిపోయే యాక్టింగ్‌ కూడా చేసింది. ఇప్పుడు ఆ సినిమా, ఆ కాంబినేషన్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారనే టాక్‌ వస్తోంది కాబట్టి.

‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) సినిమా తర్వాత అనుపమను హాట్‌ లిల్లీగానే గుండెల్లో కొలుస్తున్నారు కుర్రకారు. నెవర్‌ బిఫోర్‌ లుక్‌ అండ్‌ ఫీల్‌లో అదగొట్టింది అనుపమ ఆ సినిమాలో. అందాల ప్రదర్శనకు ఎక్కడా పరదా వేసుకోకుండా ఆ సినిమాలో నటిస్తే.. ఇప్పుడు ముఖాన ‘పరదా’ కప్పుకుని కొత్త సినిమా చేస్తోంది. ఆ సినిమా పేరే ‘పరదా’ (Paradha). ఇటీవల ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో కొత్త రకం అనుపమ కనిపిస్తుందట.

ఆ తర్వాత ఆమె చేయబోయే సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తోనే అని అంటున్నారు. కౌశిక్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు ఇటీవల టీమ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కథానాయికగా అనుపమను ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందట. చిత్ర వర్గాలు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – అనుపమ పరమేశ్వరన్‌కు ఇది రెండో చిత్రమవుతుంది.

ఇక ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాకు ‘కిష్కిందపురి’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట. త్వరలో టైటిల్‌, కథానాయికలను ఫిక్స్‌ చేసిన అనౌన్స్‌ చేస్తారట. అప్పుడు చీరకట్టులో ‘ఆకట్టుకున్న’ ఈ భామ.. ఇప్పుడు కొత్త సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి. ఎందుకంటే లిల్లీని మళ్లీ మళ్లీ చూడాలని యువత వెయిట్‌ చేస్తోంది. మరి అనుపమ ఏమనుకుంటుందో తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.