ఉగాది ముహూర్తం… ఏయే సినిమాలు స్టార్ట్‌ అవుతాయో?

తెలుగు వాళ్లకు తొలి పండగ అంటే ఉగాది అంటారు. అందుకే ఏటా ఆ రోజున తెలుగు సినిమా జనాలు తమ సినిమాల అప్‌డేట్స్‌ ఇస్తుంటారు. చాలావరకు సెట్స్‌ మీద ఉన్న సినిమాలు, రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలు, సెట్స్‌పైకి రావాల్సిన సినిమాలు… ఇలా అన్ని రకాల ప్రాజెక్ట్‌ల అప్‌డేట్స్‌ వచ్చేస్తుంటాయి. అలా ఈ ఏడాది ఉగాది (ఏప్రిల్‌ 9) సందర్భంగా ఎలాంటి అప్‌డేట్స్‌ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. అందరివీ చెప్పలేం కాబట్టి… స్టార్‌ హీరోలవి చూద్దాం.

చిరంజీవి (Megastar Chiranjeevi) – మల్లిడి వశిష్ట (Vassishtha)  కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Vishwambhara) నుండి ఓ గ్లింప్స్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఇక సుస్మిత కొణిదెల (Sushmita) – పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఆ రోజే వచ్చే అవకాశం ఉంది.

బాలకృష్ణ (Balakrishna) – బాబిల (K. S. Ravindra) సినిమా నుండి ఆసక్తికరమైన సమాచారం వస్తుంది అంటున్నారు. అయితే టైటిల్‌ విషయంలో క్లారిటీ రాలేదు. అలాగే ‘అఖండ 2’ (Akhanda) , హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) సినిమాల సంగతి తేలే అవకాశం ఉంది.

నాగార్జున (Nagarjuna) – ధనుష్‌ల (Dhanush) ‘కుబేర’ కాకుండా మరో మల్టీస్టారర్‌ చేస్తారని వార్తలొస్తున్నాయి. తమిళ నిర్మాత చేయబోయే ఆ సినిమా గురించి అప్‌డేట్‌ ఉండొచ్చు.

వెంకటేశ్ (Venkatesh) – దిల్ రాజు (Dil Raju) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనౌన్స్‌మెంట్‌ ఆ రోజు ఉంటుంది అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నుండి తన సినిమాల పోస్టర్లు వచ్చే అవకాశం ఉంది. అంతకుమించి ఊహించలేం.

మహేష్‌బాబు (Mahesh) – రాజమౌళి (Rajamouli) సినిమాకు సంబంధించి ఆ రోజు ప్రాథమిక సమాచారం రావొచ్చు అంటున్నారు. ఓపెనింగ్‌ అయినా ఆ ఈవెంట్‌కి మహేష్‌ రాడు.

ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. మారుతి ‘రాజాసాబ్‌’ (The Rajasaab) నుండి మరో ‘లైవ్‌’ పోస్టర్‌ రావొచ్చని టాక్‌.

రామ్‌చరణ్‌ (Ram Charan)  – బుచ్చిబాబు (Buchi Babu) సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్‌ రిలీజ్‌ అవుతుంది. ఇక ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) నుండి ఆ రోజు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

తారక్‌  (Jr NTR) నుండి ‘దేవర’ (Devara) అప్‌డేట్‌తోపాటు.. ‘వార్‌ 2’ అప్‌డేట్‌ కూడా వస్తాయి అని చెబుతున్నారు. అయితే ‘వార్‌ 2’ నుండి వెల్‌కమ్‌ పోస్టర్‌ మాత్రమే రావొచ్చు అని చెబుతున్నారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) – అట్లీ (Atlee) సినిమా అనౌన్స్‌మెంట్‌ ఆ రోజు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇది ఒక రోజు ముందు అంటే ఏప్రిల్‌ 8నే వచ్చేయొచ్చు అనే టాకూ ఉంది.

ఇవి కాకుండా మిగిలిన హీరోలకు సంబంధించిన చాలా విషయాలు ఆ రోజు తెలుస్తాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.