ఎనిమిది సీక్వెల్స్‌తో వస్తున్న స్టార్‌ హీరో… ఎవరంటే?

ఒక సినిమాకు సీక్వెల్‌ చేయడమే పెద్ద విషయం అనుకుంటున్న రోజులివి. ఎందుకంటే ఆ కథలు అంత ఈజీగా కుదరవు, హీరో కూడా అంత ఈజీగా ఓకే చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 8 సీక్వెల్‌ సినిమాలు చేస్తున్నారు అంటే ఎంత పెద్ద విషయమో చెప్పండి. అలాంటి గొప్ప ఫీట్‌ను బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) సాధించాడు. అవును మీరు చదివింది నిజమే… అజయ్‌ దేవగణ్‌ ఏకంగా ఎనిమిది సీక్వెల్స్‌ సినిమాలు చేస్తున్నాడు.

సాధారణంగా హిట్‌ సినిమాలకే సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీలు వస్తుంటాయి. మొదటిభాగం హిట్‌ అయ్యిందంటే, తర్వాత వచ్చే చిత్రాలపై భారీగా అంచనాలు ఉంటాయి. ఇలాంటి సీక్వెల్స్‌ విషయంలో అజయ్‌ దేవగణ్‌ క్రేజీ ఫీట్‌ చేయబోతున్నాడు. ఆయన సీక్వెల్స్‌ లెక్క చూస్తే… ‘రైడ్‌ 2’, ‘సింగం అగైన్‌’ (Singham), ‘ఢమాల్‌ 4’, ‘గోల్‌మాల్‌ 5’, ‘దే దే ప్యార్‌ దే 2’ (De De Pyaar De) , ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’, ‘దృశ్యం 3’, ‘సైతాన్‌ 2’ వరుసలో ఉన్నాయి.

రాజ్‌కుమార్‌ గుప్త దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్‌’ సినిమాకు కొనసాగింపుగా ‘రైడ్‌ 2’ సిద్ధమవుతోంది. ఇక రోహిత్‌ శెట్టి (Rohit Shetty) ‘సింగం అగైన్‌’ సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉంది. ఇక ‘ఢమాల్‌ 4’, ‘గోల్‌మాల్‌ 5’లకు సంబంధించి స్క్రిప్ట్‌ పనులు కొలిక్కి వస్తున్నాయి అని సమాచారం. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో (Rakul Preet Singh) ‘దే దే ప్యార్‌ దే 2’ త్వరలో ప్రారంభం అని అంటున్నారు. వర్తమానంలో జరిగే ‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’ తీస్తారట.

ఇక ‘దృశ్యం 3’ సినిమాను జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) రెడీ చేస్తున్నారు. మలయాళ సినిమా సంగతి తేలాక… ఇక్కడ మొదలవుతుంది. రీసెంట్‌ హిట్‌ ‘సైతాన్‌’కి సీక్వెల్‌ తీసుకురావాలని అజయ్‌ అనుకుంటున్నారట. త్వరలో ఈ విషయమూ తేలుతుంది. ఈసారి మాధవన్ పాత్రను మరింత కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారట. అజయ్ కోచ్‌గా నటించిన ‘మైదాన్‌’ (Maidaan) సినిమా ఈ నెల10న ప్రేక్షకుల ముందుకురానుంది. పై లెక్క ప్రకారం చూస్తే… అజయ్‌ ఇకపై నటించే సినిమాలు దాదాపు సీక్వెల్సే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.