Jr NTR: వార్2 సినిమాలో తారక్ తండ్రి పాత్రలో కనిపించే నటుడు అతనేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జగపతిబాబు (Jagapathi Babu) కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) , అరవింద సమేత వీరరాఘవ (Aravinda Sametha Veera Raghava) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఎన్టీఆర్ కు విలన్ గా జగపతిబాబు నటించారు. అయితే అప్పుడు విలన్ గా నటించిన జగపతిబాబు ఇప్పుడు తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. వార్2 సినిమాలో తారక్ కు తండ్రి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. సలార్ (Salaar) , మరికొన్ని ప్రాజెక్ట్ ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పటికే జగపతిబాబు ఇతర భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వార్2 సినిమాలో నటిస్తే జగపతిబాబు రేంజ్ మారిపోతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను నియమించుకుని వర్కౌట్లు చేస్తున్నారని రా ఏజెంట్ గా తారక్ లుక్ అదిరిపోతుందని సమాచారం అందుతోంది.

అయాన్ ముఖర్జీ స్పందిస్తే ఈ సినిమా గురించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని భోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ వార్2 షూట్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వార్2 మూవీ కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది. అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నా వార్2 మూవీ ఆ అంచనాలను మించి ఉంటుందని భోగట్టా.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.