March 25, 202510:50:24 AM

Mega 157: ‘మెగా 157’… డైరెక్టర్ ఫైనల్ అయిపోయాడు..కానీ..?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుండి గతేడాది 2 సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సూపర్ హిట్ కాగా… తర్వాత వచ్చిన ‘భోళా శంకర్’ (Bhola Shankar) అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన నెక్స్ట్ సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara) పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరు. ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఇది మెగాస్టార్ కెరీర్లో 156 వ సినిమాగా తెరకెక్కుతుంది. దీని తర్వాత సినిమాని చిరు ఏ దర్శకుడితో చేస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది.

వాస్తవానికైతే 156 వ సినిమా ‘బంగార్రాజు’ (Bangarraju) దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో (Kalyan Krishna) చేయాలి చిరు. అది ప్రసన్న కుమార్ కథతో.! ముందుగా చిరు.. బీవీఎస్ రవి కథతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేయాలి అనుకున్నారు. కానీ అనుకోకుండా ‘విశ్వంభర’ ని చిరు ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు పెండింగ్లో పడింది. అయితే అదే బి.వి.ఎస్ రవి (B. V. S. Ravi) కథతో చిరు సినిమా చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారట. కాకపోతే కళ్యాణ్ కృష్ణకి బదులు హరీష్ శంకర్ ని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

హరీష్ (Harish Shankar) .. చిరుతో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan)  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) పూర్తి చేయాలి. మరోపక్క రవితేజతో (Ravi Teja) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇవి రెండు కంప్లీట్ చేసే టైంకి చిరు ‘విశ్వంభర’ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. సో ఈ కాంబో నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.