సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలలో నటించకపోయినా మహేష్ బాబుకు ఇప్పటికే ఇతర భాషల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా థియేటర్లలో యావరేజ్ గా నిలిచినా ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రాజమౌళి (Rajamouli) మహేష్ కాంబో మూవీపై కూడా అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.
మరోవైపు మహేష్ బాబు తరచూ విదేశాలకు వెళ్తుండగా ఆ ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ భార్య నమ్రత (Namrata Shirodkar) గౌతమ్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసుకున్నారు. అయితే ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలో గౌతమ్ అచ్చం మహేష్ లా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. గౌతమ్ ను నమ్రత ముద్దాడుతూ ఉన్న ఆ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
చిన్నప్పటి ఫోటోలలో గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గౌతమ్ మరో మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ చైల్డ్ హుడ్ ఫోటోలను చూస్తుంటే చిన్నప్పటి మహేష్ ఫోటోలను చూసినట్టే ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మహేష్ గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.
మే 31వ తేదీన మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం పడిన టెన్షన్ ఏ సినిమా కోసం పడలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
View this post on Instagram