Pawan Kalyan: పుష్ప2 సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కానీ?

ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) , పుష్ప ది రూల్ (Pushpa2) , ఓజీ (OG Movie), దేవర (Devara), గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ 5 సినిమాలు టాలీవుడ్ స్థాయిని పెంచే సినిమాలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాకు నిర్మాతలు డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ వైరల్ అవుతోంది. పుష్ప ది రూల్ సినిమాకు పవన్ (Pawan Kalyan) వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం పుష్ప ది రూల్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. పుష్ప ది రూల్ సినిమాకు మరిన్ని అదనపు ఆకర్షణలు ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

పుష్ప2 సినిమా ట్రైలర్ కోసం మాత్రం ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పవని జులై నెలలో ట్రైలర్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాలో ప్రతి పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరిగేలా సుకుమార్ (Sukumar) నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రెండు నెలల సమయం కేటాయించనున్నారు.

పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత ఆలస్యం అయ్యాయి. ఈసారి మాత్రం ఆ తప్పులు పునరావృతం కాకుండా అడుగులు పడుతున్నాయి. సుకుమార్ ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా రెమ్యునరేషన్ల కోసమే 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని భోగట్టా.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.