విశాల్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ‘భరణి’ ‘పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘రత్నం'(తమిళ్ లో ‘రత్తం’). సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో మొదటి నుండి ఈ ప్రాజెక్టు పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. జీ స్టూడియోస్‌తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ కాగా సముద్రఖని వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా రూపొందిన ‘రత్నం’ ఏప్రిల్ 26న అంటే ఈరోజు రిలీజ్ కాబోతుంది.
ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటుందట. తమిళ వాసన కొట్టే కామెడీ, యాక్షన్ ట్రాక్స్ మాస్ ఆడియన్స్ ని లేదా టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి అని అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ అవుతుంది అంటున్నారు.
సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ గా ఉంటుందట. అయితే అవి కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మొత్తంగా కథలో కానీ, టేకింగ్ లో కానీ కొత్తదనం లేకపోయినా ఇప్పుడు కనీసం చెప్పుకోడానికి ఏ సినిమాలు లేవు కాబట్టి.. ‘రత్నం’ మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
#Rathnam reviews from Industry People.
Commercial Action Entertainer
Winner for #ActorVishal & #DirectorHari.
In Cinemas This Friday pic.twitter.com/SxXSEwaH9N— 3rdeyereports (@Padma70328265) April 25, 2024
Show time #Rathnam
Blockbuster comback from #vishal #Rathnammovie #RathnamFromTomorrow #Rathnamreview pic.twitter.com/8ek7QGUg0x
— #Rathnam (@raghav917252) April 26, 2024
#Vishal – #Hari‘s Action Entertainer #Rathnam from today .. Good interviews & down the ground promotions for this film pic.twitter.com/Rdj3DZwsPU
— VCD (@VCDtweets) April 26, 2024
expecting a vel like repeat value padam would be too much to ask for but even if half of the emotions in this song worked in rathnam adhu podhum,been waiting a long long time for hari to get back to his prime pic.twitter.com/x1bxXq2kfx
— Vedha/Patty & Minny Stan (@Vedhaviyaas5) April 25, 2024