March 16, 202510:12:42 PM

Vijay Deverakonda: మరోసారి విజయ్ దేవరకొండ సంచలన కామెంట్లు..!

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  హీరోగా పరశురామ్(బుజ్జి) (Parasuram)  దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రూపొందిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్'(Family Star). ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఏప్రిల్ 5 న ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల డోస్ కూడా పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. మొన్ననే ప్రెస్ మీట్ నిర్వహించారు.

మళ్ళీ నిన్న సూరారంలో ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మేటర్ ఏంటంటే.. ‘లైగర్’ రిలీజ్ కి ముందు అది కోవిడ్ టైంలో ఆ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే రూ.200 కోట్లు ఇస్తామని ఓ డిజిటల్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ స్పందించి ‘థియేటర్ల నుండి రూ.200 కోట్లకు మించి కలెక్షన్లు ఆశిస్తున్నట్టు’ చెప్పుకొచ్చాడు.

దీనిపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. చాలా మంది విజయ్ దేవరకొండ కి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ట్రోలింగ్ చేశారు. ‘లైగర్’ (Liger) రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాక ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. వీటిపై విజయ్ తాజాగా స్పందించాడు. ” ఒకసారి నా సినిమాకి రూ.200 కోట్ల కలెక్షన్ ఆశిస్తున్నట్టు చెబితే చాలా మంది నన్ను తిట్టి పోశారు. బలుపు అన్నారు, ఆరోగెన్స్ అన్నారు.

కానీ నేను చెప్పేది ఏంటంటే… రూ.200 కోట్లు కొడతాను అని చెప్పడం తప్పు కాదు, కొడతాను అని చెప్పి కొట్టకపోవడం తప్పు. ఈ రోజుకీ దాని వల్ల నేను తిట్లు తింటూనే ఉన్నాను. కానీ ఏదో ఒకరోజు నేను రూ.200 కోట్లు కొడతాను. కొట్టే వరకు మీరు ఎన్ని తిట్లు తిట్టినా పడతాను. ఇది బలుపు కాదు. నా పై నాకు ఉన్న నమ్మకం” అంటూ చెప్పుకొచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.