Allu Arjun: వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం వెనుక అసలు లెక్క ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వరుసగా అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramul0), పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకోగా పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) సినిమాతో బన్నీ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సాధారణంగా బన్నీ పాలిటిక్స్ కు దూరంగా ఉంటారు. అయితే తాజాగా బన్నీ పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) మద్దతు ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో చెప్పను బ్రదర్ అని కామెంట్ చేసిన బన్నీ ఇప్పుడు పవన్ కు సపోర్ట్ చేయడం ఫ్యాన్స్ కు షాకిచ్చింది.

అయితే జనసేనకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే బన్నీ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. బన్నీ దంపతులకు రవిచంద్ర కిషోర్ రెడ్డి మంచి స్నేహితుడని సమాచారం. ఆ స్నేహ బంధం వల్లే బన్నీ రవిచంద్ర కిషోర్ కు మద్దతు తెలుపుతూ ప్రచారం చేయనున్నారు.

బన్నీ ప్రచారం రవిచంద్రకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అల్లు ఫ్యామిలీ రవిచంద్ర ఫ్యామిలీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ అటు జనసేన అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఇటు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ ఆడా ఉంటా ఈడా ఉంటా డైలాగ్ ఫాలో అవుతున్నారని కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్ పొలిటికల్ ప్రచారం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పుష్ప ది రూల్ నుంచి త్వరలో సెకండ్ సింగిల్ విడుదల కానుందని సమాచారం. ఫస్ట్ సింగిల్ అంచనాలను మించి హిట్ గా నిలిచిన నేపథ్యంలో సెకండ్ సింగిల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.