Anand Deverakonda: ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ కావడానికి వాళ్లే కారణమా.. ఆనంద్ ఏమన్నారంటే?

సాధారణంగా దిల్ రాజు (Dil Raju) బ్యానర్ నుంచి ఏదైనా సినిమా విడుదలైతే ఆ సినిమా మినిమం గ్యారంటీ అని అభిమానులు భావిస్తారు. అయితే ఫ్యామిలీ స్టార్ (Family Star) మూవీ విషయంలో మాత్రం ఆ అంచనాలు నిజం కాలేదు. ఈ సినిమాకు పరశురామ్ (Parasuram) దర్శకుడు కాగా సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్ విషయంలో సైతం సైతం నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ సినిమా మరీ బ్యాడ్ సినిమా అయితే కాదని చాలామంది భావిస్తారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ కాలేదని ఫ్లాప్ చేశారనే అర్థం వచ్చేలా ఆనంద్ దేవరకొండ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే ఈ సినిమా విషయంలో జరిగిన నెగిటివ్ పబ్లిసిటీ గురించి ఆనంద్ దేవరకొండ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ విషయంలో భారీ కుట్ర చేశారనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్లు చేశారు.

ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు 48 గంటల ముందే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాత సినిమాల నెగిటివ్ టాక్ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ అంటూ ప్రచారం చేయడం జరిగిందని ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)  అన్నారు. ఆ థంబ్ నెయిల్స్ వల్ల ఆడియన్స్ కన్యూజన్ కు గురయ్యారని ఆయన వెల్లడించారు. సినిమా చూసిన తర్వాత రిజల్ట్ గురించి ఎవరైనా మాట్లాడొచ్చని ఆనంద్ దేవరకొండ అన్నారు.

సినిమా విడుదలకు ముందే సినిమాను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని భావించి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామని ఆనంద్ దేవరకొండ తెలిపారు. విజయ్ దేవరకొండ నుంచి ఇకపై మంచి సినిమాలు వస్తాయని విజయ్ భవిష్యత్తు మూడు సినిమాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నానని ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు. గం గం గణేశా (Gam Gam Ganesha) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ ఈ కామెంట్లు చేయడం జరిగింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.