Balakrishna Daughter: బాలయ్య చిన్న కూతురిలో ఉన్న ఈ టాలెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

స్టార్ హీరో బాలయ్య (Nandamuri Balakrishna) ఈ మధ్య కాలంలో వరుసగా యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి వరుస విజయాలు సాధించడానికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని చాలామంది భావిస్తారు. తేజస్విని సూచనల మేరకు బాలయ్య కథలను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో బాలయ్య సక్సెస్ రేట్ అంచనాలకు మించి పెరిగిందనే సంగతి తెలిసిందే. మరోవైపు తేజస్విని భర్త భరత్ ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

భరత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తేజస్విని గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో భరత్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తేజస్వినికి క్రియేటివ్ సైడ్ మంచి టాలెంట్ ఉందని భరత్ కామెంట్లు చేశారు. బాలయ్య స్క్రిప్ట్ గురించి, డైరెక్టర్ల గురించి తేజస్వినితో చర్చిస్తారని భరత్ వెల్లడించారు. యంగ్ డైరెక్టర్లతో పని చేయడం వల్ల సినిమాకు కొత్తదనం వస్తుందని బాలయ్య సక్సెస్ సీక్రెట్ ఇదేనని భరత్ అన్నారు.

బాలయ్య అన్ స్టాపబుల్ చేయడం వెనుక తేజస్విని సపోర్ట్ ఉందని ఆయన తెలిపారు. తేజస్వినికి ప్రొడక్షన్ పై కూడా ఆసక్తి ఉందని భరత్ వెల్లడించడం గమనార్హం. కథలను పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసే టాలెంట్ తేజస్వినికి ఉండటంతో ఆమె సులువుగానే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో తేజస్విని బాలయ్య సినిమాలనే నిర్మించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

తేజస్విని హ్యాండ్ వల్ల బాలయ్య బాబీ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య సినిమాలకు ఇతర భాషల్లో సైతం ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.