March 16, 202509:57:15 PM

వెంకటేష్ బ్యూటీకి చేదు అనుభవం.. ఏమైందంటే..!

కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా, సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మంది కెరీర్ నాశనమైపోతుందని, అవసరాన్ని అవకాశంగా తీసుకుని పడక సుఖం కోసం వేధించే బ్యాచ్ ఇక్కడ ఉన్నారని చాలా మంది నటీమణులు చెప్పుకొచ్చారు. కాకపోతే చాలా మంది ఫేడౌట్ అయిపోయాక, లేదు అంటే కెరీర్ డౌన్లో ఉన్న టైంలో ఇలాంటి కామెంట్స్ చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లు ఈ కామెంట్స్ చేసిన సందర్భాలు తక్కువ.

ఇంకోరకంగా లేవు అనే చెప్పాలి. ఇప్పుడు కూడా సుచిత్ర పిళ్లై (Suchitra Pillai) అనే ఫేడౌట్ దశకి దగ్గర్లో ఉన్న నటి క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. అందమైన అమ్మాయిలకి అయితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.కొంతమందికి అవకాశాలు వస్తాయి.. ఇంకొంతమందికి రాకపోవచ్చు. వారికి అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు.. ఇంకేదో ఆశించే ఛాన్స్ ఉంది. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తావు అంటారు.

అందుకే నాకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు. దాని కోసం నన్ను ఎవరైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు భయపడుతుంటారు. అయితే సౌత్ నుండి నాకు ఓసారి ఫోన్ వచ్చింది. ‘ఛాన్స్ వస్తే సౌత్ సినిమాలో చేస్తారా?’ అని నన్ను అడిగారు. అందుకు నేను ఓకే అన్నాను. ఆ తర్వాత అతను ఈ పెద్ద సినిమాలో ఛాన్స్ కోసం ‘కాంప్రమైజ్ అవుతారా?’ అని నన్ను అడిగాడు.

దీంతో నాకు కోపం వచ్చింది. వెంటనే అతన్ని ఎడా పెడా కడిగేసాను. ఇంకోసారి ఇలా ఫోన్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ధమ్కీ ఇచ్చాను. మళ్లీ అతను ఫోన్ చేయలేదు. నటిగా నాకున్న గుర్తింపు చాలు.. అలాంటి దారిలో వెళ్లడం నాకు ఇష్టం లేదు” అంటూ చెప్పుకొచ్చింది సుచిత్ర పిళ్ళై. ఇక సుచిత్ర పిళ్ళై.. ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్ సిరీస్లో వెంకటేష్ కి (Venkatesh Daggubati) జోడీగా చేసిన సంగతి తెలిసిందే.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.