సినీ పరిశ్రమలో విషాదం.. ‘ప్రేమలు’ నటుడి జీప్ కి యాక్సిడెంట్

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. తాజాగా ‘ప్రేమలు’ నటుడి ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. ‘ప్రేమలు’ (Premalu) సినిమాలో హీరో ఫ్రెండ్ అముల్ కి బావ అయినటువంటి ఓ కుర్రాడు అందరికీ గుర్తుండే ఉంటుంది. అమాయకంగా పబ్బులోకి వెళ్లే కుర్రాడిగా ఇతను కనిపిస్తాడు.అతని పేరు మాథ్యూ థామస్‌(Mathew Thomas) . అయితే తాజాగా ఇతని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మాథ్యూ థామస్‌ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడింది. దీంతో ఒకరు మృతి చెందగా.. థామస్‌ అతని తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారని సమాచారం.బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.బంధువుల కుటుంబంలో ఎవరో మరణించారని తెలిసి పలకరింపు వెళ్లి వస్తుండగా.. శస్తాముగల్‌లోని నేషనల్ హైవే వద్ద అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న కాలువ గుంతలో వీరి జీపు పడి బోల్తా కొట్టిందట.

మాథ్‌యూ సోదరుడు జాన్‌ జీపు డ్రైవ్ చేసినట్టు తెలుస్తుంది. అతనికి ఎటువంటి గాయాలు కాలేదట.అయితే థామస్ దూరపు బంధువు మామల తురుత్తికి చెందిన రిటైర్డ్ టీచర్ బీనా డేనియల్ మాత్రం ఈ ఘటనలో మృతి చెందారు. ఆమె వయసు 61 ఏళ్ళు అని తెలుస్తుంది. మరోపక్క బీనా భర్త సాజు, మాథ్యూ తల్లిదండ్రులు బిజు, సుసన్‌లకు తీవ్ర గాయలు కావడంతో.. ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేరళ మీడియా వర్గాలు తెలియజేశాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.