Chiranjeevi: మరోసారి మోహన్ రాజాకి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ మధ్య కాలంలో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని ఆయన అనుకోవడం లేదు. ‘బౌండ్ స్క్రిప్ట్ ఎవరి వద్ద ఉంది?.. అది తన ఏజ్ కి, ఇమేజ్ కి ఎంత వరకు సెట్ అవుతుంది?’ ఈ లెక్కలు వేసుకుని కానీ ఆయన ఓ దర్శకుడితో సినిమాని ఫైనల్ చేయడం లేదు. ‘బంగార్రాజు’ (Bangarraju) హిట్ తో ఫామ్లో ఉన్న కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) , ‘భీష్మ’ (Bheeshma) తో హిట్టు కొట్టిన వెంకీ కుడుముల (Venky Kudumula) వంటి దర్శకులని ఆయన హోల్డ్ లో పెట్టారు అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.

అయితే చిరుని ఈ మధ్య కాలంలో బాగా ఇంప్రెస్ చేసిన డైరెక్టర్స్ లో మోహన్ రాజా (Mohan Raja) ఒకరు. తెలుగులో డబ్ అయినప్పటికీ ‘లూసిఫర్’ చిత్రాన్ని ఆయన రీమేక్ చేయడానికి ఒప్పుకుంది మోహన్ రాజా డెవలప్ చేసిన స్క్రిప్ట్ వల్లే..! అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీయాలని ఉందని ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రమోషన్స్ లో చిరు చెప్పుకొచ్చారు. అది జరుగుద్దో లేదో తెలీదు కానీ.. మోహన్ రాజా దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి అయితే చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం చిరు ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) తో ‘విశ్వంభర’ (Vishwambhara)  అనే మూవీ చేస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ తో (Harish Shankar) ఆయన మూవీ చేయాల్సి ఉంది. అలాగే మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో కూడా సినిమా చేస్తానని చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేస్లోకి మోహన్ రాజా కూడా వచ్చారు కాబట్టి.. ఎవరి ప్రాజెక్టు ముందుగా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.