Director Teja: తేజ కొత్త సినిమా ఏంటి? అనౌన్స్‌ చేస్తున్నారు.. కానీ

‘చిత్రం’, ‘జయం’ (Jayam) , ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) , ‘ఔనన్నా కాదన్నా’, ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) … ఇలాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఇచ్చిన దర్శకుడు తేజ (Teja) . మూడు పేర్లే చెప్పి అంత గొప్ప అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఆయన ఇచ్చిన హిట్లు తక్కువే కావొచ్చు.. కానీ తెలుగు సినిమాపై అవి చూపించిన ఇంపాక్ట్‌ చాలా గొప్పది కాబట్టి. అయితే ఆయన లేటెస్ట్‌గా అనౌన్స్ చేసిన సినిమాలు ఆ స్టేజీలోనే ఉండిపోతున్నాయి. ఎన్నో భారీ విజయాలు అందుకున్న సినిమాలు తీసిన తేజ గత కొన్నేళ్లుగా అవుట్ అఫ్ ఫామ్‌లో ఉన్నారు.

ఎలాంటి సినిమా తీసినా ప్రేక్షకుల దగ్గర మెప్పు పొందిన ఆయన.. ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్‌ చేసి అక్కడితో ఆగిపోతున్నారు. రానాతో (Rana Daggubati) ‘రాక్షస రాజు’ అనే సినిమా ఆ మధ్య అనౌన్స్‌ అయింది గుర్తుందా? ఇదిగో షూటింగ్‌, అదిగో షూటింగ్‌ అంటున్నారు కానీ సినిమా మొదలవ్వడం లేదు. సినిమా ఇంకా ఉందా అంటే ఏమో అనే సమాధానం వస్తోంది. ఇక వెంకటేశ్‌తో (Venkatesh Daggubati) ‘ఆటా నాదే వేటా నాదే’ అనే సినిమా చేస్తారు అని ఆ మధ్య తేజ గురించి టాక్‌ నడిచింది.

దీని కోసం ఆడిషన్లు కూడా జరిగాయి. షూటింగ్‌ కూడా మొదలైంది అన్నారు కానీ.. ఇప్పుడు దాని పత్తా లేదు. ఆ తర్వాత గోపీచంద్‌తో (Gopichand) సినిమా ఫిక్స్ అయ్యింది అని కూడా అన్నారు. అదీ అటెటో పోయింది. ఇవన్నీ కాదు తన కొడుకునే హీరోగా పెట్టి ‘చిత్రం 2’ సినిమా చేస్తారు తేజ అని ఆ మధ్య చెప్పారు. దీనినీ వదిలేశారట. దీంతో అసలు తేజ ఏం చేస్తున్నారు? కొత్త సినిమా ఎప్పుడు మొదలుపెడతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఆయన సినిమాలు రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా కొత్తగా ఉంటాయి కాబట్టి. అయితే ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులకు నచ్చుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. మెచ్చని సినిమాలు చేసే నచ్చే దర్శకుడికి ఇప్పుడు కష్ట కాలం నడుస్తోంది. ఇది ఎక్కువ రోజులు ఉండకూడదని ఆశిద్దాం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.