Kasthuri Shankar: జ్యోతికపై కస్తూరి సెటైర్లు.. ఏమైందంటే?

సీనియర్ హీరోయిన్, ప్రముఖ నటి కస్తూరి (Kasthuri Shankar) అందరికీ సుపరిచితమే.ఒకప్పుడు ‘భారతీయుడు’ ‘అన్నమయ్య’ (Annamayya) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈమె నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు ‘డాన్ సీన్’ (Don Seenu) వంటి సినిమాల్లో కూడా చేశారు. సినిమాల్లో అవకాశాలు కరువవడంతో ఈమె ‘గృహలక్ష్మీ’ సీరియల్ ద్వారా బుల్లితెర పై ప్రేక్షకులకి దగ్గరైంది. ఆ సీరియల్లో ఈమె తల్లి పాత్ర తో మెప్పించింది. అది పక్కన పెట్టేస్తే.. కస్తూరి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది.

తాను ఫెమినిస్ట్ అంటూ ఈమె గతంలో మిగిలిన నటీమణులపై చేసిన కామెంట్స్ ను జనాలు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. మొన్నటికి మొన్న మహేష్ బాబు (Mahesh Babu) వయసు తన వయసు ఒక్కటే అంటూ ఈమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతలోనే మరో వివాదంతో వార్తల్లోకి వచ్చింది కస్తూరి. తాజాగా ఈమె జ్యోతిక (Jyothika) పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో జ్యోతిక ఓటు వేయలేదు.

దీనిపై జ్యోతిక స్పందించిన సంగతి తెలిసిందే. ‘కొన్ని సార్లు ఊర్లో ఉండకపోవచ్చు, మాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. నేను కొన్ని సార్లు ఆన్ లైన్ లో ఓట్లు వేశాను. ప్రతి ఏడాది ఓట్లు వేస్తాను’ అంటూ జ్యోతిక కామెంట్స్ చేసింది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకి.. ప్రతి ఏడాది ఓటు వేయడం ఏంటి అంటూ ఓ రిపోర్టర్ జ్యోతికను ప్రశ్నించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

దీనిపై కస్తూరి స్పందించి జ్యోతిక పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘మేము ఎండలో రోజంతా నిలబడి ఓట్లు వేశాం. అమెరికా ప్రయాణాలుంటే ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని వేరే డేట్లకు మార్చుకున్నాం.’ అంటూ ఆమె సెటైరికల్ కామెంట్స్ చేసింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.