Manchu Lakshmi: సమ్మర్ వెకేషన్ లో చిల్ అవుతున్న మంచు లక్ష్మి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారసురాలిగా పలు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మంచు లక్ష్మి  (Manchu Lakshmi) .. తండ్రి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది. ఈ అమ్మడు నటిగా కొనసాగుతూనే బుల్లితెరపై పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగాను నిర్మాతగాను కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన కూతురు భవిష్యత్తు కోసం ఈమె ముంబై షిఫ్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అక్కడ కూడా సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా మంచు లక్ష్మి సిద్ధమయ్యారు.

తాజాగా సమ్మర్ వెకేషన్ కోసం బ్రెజిల్ వెళ్లిన మంచు వారి అమ్మాయి అక్కడి ఫారెస్ట్ లో ఉన్న జలపాతం దగ్గర రాయిపై కూర్చుని తనదైన రీతిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో లక్ష్మి తన సొగసులు చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఇంత అందం ఇంతకాలం ఎక్కడ దాగివుందో అన్నట్లుగా రెచ్చిపోయి చూపిస్తోంది. ఈ భామ అందాన్ని చూసి కుర్రాళ్లు విరహ వేదనలో మునిగిపోతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.