Pooja Hegde: పవన్‌ సినిమా రీమేక్‌లో పూజా హెగ్డే… షూటింగ్‌ ప్రారంభం!

సౌత్‌ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి మధ్యలో వదిలేసి బాలీవుడ్‌ వెళ్లిపోయి.. మళ్లీ ఇక్కడికే వచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే (Pooja Hegde). అయితే ఏమైందో ఏమో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. స్టార్‌ హీరో సినిమా అంటే ఠక్కున హీరోయిన్‌గా గుర్తొచ్చే పూజ.. ఛాన్స్‌ల కోసం వెయిట్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆమె మరోసారి బాలీవుడ్‌కి వెళ్లింది. స్టార్‌ హీరోల సినిమాలే కాదు.. యంగ్‌ హీరోల సినిమాలూ ఓకే చేస్తోంది.

గతేడాది సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan) ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా మాత్రమే చేసి.. బిజీగా లేని హీరోయిన్‌గా నిలిచిన పూజా హెగ్డే.. ఇప్పుడు అహాన్‌ శెట్టితో ‘సంకీ’ అనే సినిమా ఓకే చేసింది. అంతే కాదు ఆ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. అద్నాన్‌ షేక్‌, యాసిర్‌ ఝూ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణను వచ్చే నెలలో ప్రారంభిస్తారట. దీంతో ఆ సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. అలాగే ఆ హీరో ఎవరు అని కూడా సెర్చ్‌చేస్తున్నారు.

‘సంకీ’ సినిమా కథ మనకు తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు మన దగ్గర పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేస్తున్న రీమేకే. అవును ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) ఒరిజినల్‌ ‘తెరి’ రీమేకే ఈ ‘సంకీ’. అయితే బాలీవుడ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేస్తున్నారట. కొన్ని నెలల క్రితమే సినిమా అనౌన్స్‌ అయినా.. ఇప్పుడు పట్టాలెక్కిస్తున్నారట. ఈ క్రమంలో కథలో చాలానే మార్పులు చేశారు అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.

ఇక్కడో విషయం ఏంటంటే.. ‘తెరి’ తెలుగు రీమేక్‌లో తొలుత పూజా హెగ్డేకే ఛాన్స్‌ వచ్చింది. కానీ వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు హిందీ రీమేక్‌లో ఛాన్స్‌ సంపాదించింది. ఇక అహాన్‌ ఎవరో మీకు తెలుసు కదా.. సునీల్‌ శెట్టి తనయుడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా రీమేక్‌ ‘తడప్‌’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.