Shankar: ఫ్లాష్‌బ్యాక్‌లో మబ్బులిడిపోయే ట్విస్ట్‌… శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ సిద్ధమా!

ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar)  రూపొందించిన సేనాపతి పాత్ర ఎంత పవర్‌ ఫుల్‌ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆ పాత్ర ‘భారతీయుడు’ సినిమాలోనిది అని మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం. అలాంటి బలమైన పాత్రను… ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’లో (Game Changer)  రామ్‌చరణ్‌ (Ram Charan)  ఫ్లాష్‌ బ్యాక్‌ పాత్రను కలపబోతున్నారా? అవుననే అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు. అవును ‘భారతీయుడు 2’ (Indian-2), ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలు ఒక దగ్గరకు రాబోతున్నాయట. కమల్ హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రలో శంకర్‌ ఇప్పుడు ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’ తీస్తున్నారు.

మరోవైపు రామ్‌ చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ రెండు సినిమాలు ఒక టైమ్‌ లైన్‌లోనివి కావు. కానీ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫ్లాష్‌ బ్యాక్‌ మాత్రం ‘భారతీయుడు 2’ సమయంలోనిదేనట. అవినీతిని ఎదుర్కొనే సేనాపతి.. ‘గేమ్‌ ఛేంజర్‌’లోని సీనియర్‌ రామ్‌చరణ్‌ ఓ సందర్భంలో ఎదురుపడతారట. ఆ పాయింట్‌తోనే శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్రాణం పోసుకోనుందట. ఇవన్నీ ‘అట’లే అవ్వొచ్చు. అయితే కచ్చితంగా నిజమయ్యే పుకార్లే అంటున్నారు.

ఎందుకంటే ఇటీవల చరణ్‌ రెండు రోజుల పాటు చెన్నైలో షూటింగ్‌ చేశాడు. అయితే అక్కడ ఏం షూటింగ్‌ జరిగింది అనేది తెలియడం లేదు. అంత చిన్న షెడ్యూల్‌ ఏంటి? ఎక్కువ మంది నటులు లేకుండా ఏ షూట్‌ చేశారు అనే విషయం వాకబు చేస్తే ఈ యూనివర్స్‌ సంగతి బయటికొచ్చింది. ఇందులో నిజానిజాలు తెలియవు కానీ.. ఈ పుకారు నిజమవ్వాలని ఫ్యాన్స్‌ మాత్రం కోరుకుంటున్నారు.

సేనాపతి స్ఫూర్తితోనే ‘గేమ్‌ ఛేంజర్‌’లో సీనియర్‌ చరణ్‌ రాజకీయాల్లోకి వస్తారని, అయితే కుటుంబంలో వెన్నుపోటు వల్ల ఇబ్బంది పడతారని.. ఆ తర్వాత తర్వాతి తరంలో యువ రామ్‌చరణ్‌ ఎన్నికల అధికారిగా మారి.. రాజకీయాల ప్రక్షాళనకు ముందుకొస్తారు అని ఓ కథ అల్లేసుకున్నారు సినిమా జనాలు. ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియాలంటే సినిమా రావాలి. దానికంటే ముందు సినిమా పూర్తవ్వాలి. ఎప్పుడవుతుందో మరి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.