Suchitra: సుచిలీక్స్ గురించి మరో బాంబు పేల్చిన సుచిత్ర.. ఆమెను టార్గెట్ చేసిందిగా!

కొన్ని సంవత్సరాల క్రితం సుచిలీక్స్ పేరుతో సుచిత్ర (Suchitra Ramadurai) కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ సెలబ్రిటీలకు భారీ షాకులిచ్చారు. సుచిత్ర ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ప్రముఖ నటులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. త్రిష  (Trisha), హన్సిక (Hansika Motwani) , అమీ జాక్సన్ (Amy Jackson), ధనుష్ (Dhanush), అనిరుధ్ (Anirudh Ravichander) మరి కొందరి పర్సనల్ ఫోటోలు అప్పట్లో బయటకు వచ్చాయి. ఆ సమయంలో సుచిత్ర వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.

మానసిక వ్యాధితో బాధ పడుతూ ఉండటం వల్లే సుచిత్ర అప్పట్లో ఆ విధంగా ప్రవర్తించారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఆమె భర్త కార్తీక్ కుమార్  (Karthik Kumar) సైతం ఆమెకు విడాకులు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. విడాకుల తర్వాత సుచిత్ర మానసిక సమస్యలతో మరింత ఎక్కువగా బాధ పడ్డారని వార్తలు వినిపించడం గమనార్హం. తాజాగా సుచిత్ర ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఆ ఇంటర్వ్యూలో సుచిలీక్స్ లో లీక్ చేసిన ఫోటోలు అన్నీ త్రిషనే ఇచ్చిందని అన్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాత్రం త్రిష నేను హర్ట్ అయ్యాను అంటూ కామెంట్ చేసిందని ఆమె పేర్కొన్నారు. త్రిష ఒక బి*చ్ అంటూ సుచిత్ర చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నయనతార అభిమానులు సుచిత్ర కామెంట్లను ప్రస్తుతం నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ధనుష్ ఐశ్వర్య (Aishwarya Rajinikanth)  విడాకులు తీసుకోవడానికి సైతం సుచిలీక్స్ కారణమని చాలామంది భావిస్తారు. సుచిలీక్స్ పేరు వింటే ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు భయాందోళనకు గురవుతూ ఉంటారు. సుచిత్ర ఇప్పుడు తన కామెంట్ల ద్వారా మరోసారి వార్తల్లో నిలుస్తారు. త్రిష పరువుకు భంగం కలిగేలా సుచిత్ర కామెంట్లు చేసిన నేపథ్యంలో త్రిష స్పందించకపోతే సుచిత్ర చేసిన కామెంట్లను నెటిజన్లు నిజమని నమ్మే ఛాన్స్ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.