Toxic Movie: యశ్‌ కొత్త సినిమాలో మరో హీరోయిన్‌ కూడా.. ఇంకా ఎందరో?

‘కేజీయఫ్‌’ (KGF2)  సినిమాల తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంతమంది అడిగినా ఎవరికీ ఓకే చెప్పని యశ్‌ (Yash) … గీతూ మోహన్‌ దాస్‌(Geetu Mohandas)  అనే మలయాళ లేడీ దర్శకురాలికి అవకాశం ఇచ్చాడు. ‘టాక్సిక్‌’ (Toxic)  అనే పేరుతో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. సినిమా పేరు చూస్తుంటే ఫుల్‌ యాక్షన్‌ బేస్డ్‌ కంటెంట్‌లా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తున్న పుకార్లు వింటుంటే అలా అనిపించడం లేదు. కానీ ట్విస్ట్‌ చెప్పేసరికి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ భారీ ప్లాన్‌ వేస్తున్నారు అనిపిస్తుంది.

‘టాక్సిక్‌’ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor)  నటిస్తోంది అని గత కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్నాయి. అయితే ఆ పాత్రలోకి సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార  (Nayanthara)  వచ్చిందని లేటెస్ట్‌ పుకారు. ఈ విషయంలో క్లారిటీ రాలేదు కానీ.. మరో హీరోయిన్ పేరు ఇప్పుడు చర్చలోకి వచ్చింది. అయితే నయనతార ఉంటూనే ఆమె కూడా ఉంటారట. ఆమెనే బాలీవుడ్‌ బ్యూటీ హ్యూమా ఖురేషి (Huma Qureshi) . ఈ బొద్దుగుమ్మను సినిమాలోకి తీసుకున్నారని టాక్‌.

‘కేజీయఫ్‌’ విజయాల తర్వాత యశ్‌ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హ్యామా కీలక పాత్రలో కనిపిస్తుందట. అందాల ప్రదర్శన కాకుండా ఆమె యుద్ధ కళల ప్రదర్శన ఈ సినిమాలో ఉంటుంది అని చెబుతన్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా వెర్షన్‌, ఇంటర్నేషనల్‌ వెర్షన్‌.. ఇలా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న సినిమా విడుదల కానుంది.

నయన్‌ సంగతి చూస్తే.. ఈ సినిమాలో ఆమె యశ్‌కు జోడీగా కనిపిస్తుందా? లేక సోదరిగా నటిస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో త్వరలో నయన్‌ పాల్గొంటుంది అని చెబుతున్నారు. ‘టాక్సిక్‌’ సినిమాలో తోబుట్టువుల మధ్య భావోద్వేగం కనిపిస్తుంది. అలాంటి ఓ సోదరి పాత్రలో ఈ అగ్ర తార ఉంటేనే పాత్ర పండుతుందని టీమ్‌ అనుకుంటోందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.