Vidya Vasula Aham OTT: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న రాజశేఖర్ కూతురి సినిమా

సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటిస్తే చాలు.. ఆ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడుతుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అనగానే పెద్ద సినిమాల యూనిట్లు డేట్స్ లాక్ చేసుకుని జాగ్రత్త పడుతుంటాయి. అలాంటి టైంలో చిన్న సినిమా బరిలో నిలుస్తుంది అంటే.. దానిపై ఎక్కువ డిస్కషన్స్ జరుగుతాయి. అందుకే ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham) అనే సినిమా యూనిట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అది ఈ సంక్రాంతికి కాదండోయ్.. గత ఏడాది సంక్రాంతికి.

అవును 2023 సంక్రాంతికి ఈ చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రకటించారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ వెనక్కి తగ్గారు. అలా అని తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేశారా? అంటే అదీ లేదు. 2024 సంక్రాంతికి కూడా రిలీజ్ చేసింది లేదు. సడన్ గా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అవును రాహుల్ విజయ్ (Rahul Vijay) , శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) జంటగా నటించిన ఈ సినిమా త్వరలో ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతోంది.

‘ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మించిన ఈ సినిమాని మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కాంబినేషన్లో గతేడాది ‘కోట బొమ్మాళి’ (Kottabommali PS) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికంటే ముందుగానే ఈ ‘విద్య వాసుల అహం’ అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కొన్ని సమస్యల వల్ల ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డిలే అవ్వడం.. ఇప్పుడు ఏకంగా స్కిప్ చేసుకుని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.