March 21, 202512:51:27 AM

Vithika Sheru: వితిక షెరు ఎమోషనల్ కామెంట్స్ వైరల్.!

వితిక షెరు (Vithika Sheru) అందరికీ సుపరిచితమే. వరుణ్ సందేశ్ (Varun Sandesh) భార్యగా, ‘బిగ్ బాస్ 3 ‘ కంటెస్టెంట్ గా ఈమె బాగా పాపులర్. అంతకు ముందు ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది. ‘ప్రేమించే రోజుల్లో’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) , ‘భీమిలి కబడ్డీ జట్టు’ (Bheemili Kabaddi Jattu) ‘ప్రేమ ఇష్క్ కాదల్’ (Prema Ishq Kaadhal) ‘పడ్డానండీ ప్రేమలో మరి’ వంటి చిత్రాల్లో నటించింది. 2015 లో వచ్చిన ‘పడ్డానండీ ప్రేమలో మరి’ చిత్రం టైంలో ఈమె వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది.

ఆ తర్వాత వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ జంటకి కూడా మంచి క్రేజ్ ఉంది అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని గతంలో జరిగిన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. వితిక షెరు మాట్లాడుతూ.. “16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఓసారి ఆడిషన్స్ కి వెళ్లాను. అప్పుడు ఓ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకున్నారు.

అయితే అదే టైంలో మా అమ్మతో మాట్లాడాలి అని చెప్పి నన్ను బయటకు పంపారు. అప్పుడు అమ్మతో వాళ్ళు ” మీ అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్స్ రావాలంటే నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది’ అన్నారట. అమ్మకు అర్థం కాక నన్ను లోపలికి పిలవమని వాళ్ళతో చెప్పిందట. అప్పుడు నన్ను లోపలి పిలిచారు.

లోపలికి వెళ్ళాక.. ‘కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు ఏంటో కనుక్కో’ వాళ్ళ ముందు అమ్మ నాతో అంది. నాకు విషయం అర్థమైంది. వెంటనే నో చెప్పాను. ఎందుకు నో చెప్పాను అనేది మా అమ్మకి వివరించడానికి చాలా కష్టంగా అనిపించింది” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.