April 11, 202505:02:04 PM

‘పుష్ప 2’ తప్పుకోవడంతో ఆగస్టు 15 కి పెరిగిన గిరాకీ.. ఎన్ని సినిమాలో తెలుసా?

‘పుష్ప 2 ‘ (Pushpa 2) సినిమా ఆగస్టు 15 కి రిలీజ్ అవుతుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. మధ్యలో పోస్ట్ అయ్యేలా ఉంది అని రూమర్స్ వస్తే.. సుకుమార్ (Sukumar) అండ్ టీం దాన్ని తోసిపుచ్చింది. రిలీజ్ కి 200 రోజులు టైం ఉండగా.. పోస్ట్ పోన్ ఎందుకవుతుంది అంటూ వాళ్ళ టీం ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. కట్ చేస్తే నిజంగానే ‘పుష్ప 2 ‘ ఆగస్టు 15 కి రావడం లేదు. డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అయ్యింది. ‘పుష్ప 2 ‘ పోస్ట్ పోన్ అవ్వడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  మూవీ ఆ డేట్ కి వస్తున్నట్టు టీం అధికారిక ప్రకటన ఇచ్చింది.

అక్కడితో బాగానే ఉంది. ‘పుష్ప 2 ‘ రాకపోయినా.. మరో సూపర్ హిట్ సీక్వెల్ చూడొచ్చు ‘డబుల్ ఇస్మార్ట్’ మంచి ఆప్షన్ అని అంతా అనుకున్నారు. కానీ దాన్ని పెద్దగా పోటీగా తీసుకోలేదు ఏమో కానీ.. చాలా సినిమాల యూనిట్లు అదే డేట్ కి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) నటిస్తున్న ‘ఆయ్’ ఆగస్టు 15 కే రిలీజ్ అవుతుంది. ‘గీతా..’సంస్థలో రూపొందింది కాబట్టి దీనిని చిన్న సినిమా అనలేం.

దీంతో పాటు నివేదా థామస్ (Nivetha Thomas) – ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ..ల ’35 – ఇది చిన్న క‌థ కాదు’ సినిమా కూడా ఆగస్టు 15 కే రిలీజ్ అవుతుంది. అలాగే గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వం’ ని (Viswam) కూడా అదే డేట్ కి రిలీజ్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఎందుకు ‘ఆగస్టు 15’ అంత స్పెషల్ అనే డౌట్ ఎవరికైనా రావచ్చు? ఆ రోజు పబ్లిక్ హాలిడే ఉంది.

పైగా ఆ డేట్ కి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. తర్వాతి రోజు శుక్రవారం అంటే వీకెండ్ మొదలైనట్టే..! అలా 4 రోజుల పాటు కొత్త సినిమాలకి కలిసొస్తుంది. అందుకే ఆ డేట్ కి పైన చెప్పుకున్న సినిమాలే కాదు.. ఇంకొన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.