
ఈ ఏడాది చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో హీరోయిన్లు.. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra)..లతో పాటు దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) , హీరో తిరువీర్ వంటి వారు కూడా ఉన్నారు. తాజాగా అర్జున్ కూతురు వివాహం కూడా జరిగింది. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఒకే ఒక్కడు’ ‘జెంటిల్ మెన్’ ‘హనుమాన్ జంక్షన్’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారాయన..!
ఇక అసలు మేటర్లోకి వెళితే…. యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) కూతురు ఐశ్వర్య (Aishwarya Arjun) వివాహం నిన్న అంటే జూన్ 10న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఘనంగా జరిగింది. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖుల.. సమక్షంలో వీరి వివాహం జరిగింది. జూన్ 7న నుండి హల్దీ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.
జూన్ 8న సంగీత్ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. ఇక జూన్ 10న ఉదయం 9 to 10 గంటల మధ్య ఐశ్వర్య- ఉమాపతి..ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.జూన్ 14 న చెన్నైలో ఉన్న లీలా ప్యాలెస్ లో రిసెప్షన్ ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక అర్జున్- ఉమాపతి..ల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram