April 10, 202511:50:55 AM

Allu Arjun: ‘కల్కి 2898 ad’ మూవీ అల్లు అర్జున్ రియాక్షన్.!

తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) ‘కల్కి..’  (Kalki 2898 AD)   సినిమా పై స్పందించారు. తన ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… “నా మిత్రుడు ప్రభాస్ (Prabhas)  గారు నిజంగానే సూపర్ హీరోలా ఉన్నారు. తన నటనా ప్రతిభతో భైరవ పాత్రకి జీవం పోశారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  గారు.. నిజంగానే మీరు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలు. సినిమాలో మీ పాత్ర చూస్తున్నంత సేపు నాకు మాటల్లేవ్! కమల్ హాసన్ (Kamal Haasan) సర్… మీ పెర్ఫార్మెన్స్ కి నా హృదయపూర్వక ప్రశంసలు.

మీరు భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. డియర్ దీపికా పదుకొణె…మీరు ఎక్కడ తడబడకుండా మీ పాత్రలో ఒదిగిపోయారు. దిశా పటానీ (Disha Patani)… నువ్వు స్క్రీన్ పై అందర్నీ ఆకర్షించే విధంగా ఉన్నారు. ఇక ‘కల్కి..’ కోసం పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్లకు… ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్, మేకప్ విభాగం నిపుణులకు నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను.

ఫైనల్ గా ఈ సినిమా క్రెడిట్ అంతా వైజయంతీ మూవీస్ కు, అశ్వనీదత్  (C. Aswani Dutt)  గారికి, స్వప్న దత్ (Swapna Dutt) , ప్రియాంక దత్(Priyanka Dutt)..లకి చెందుతుంది. ఎంతో రిస్క్ తీసుకుని ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచే సినిమా అందించారు. ఇక ఈ సినిమాకి కెప్టెన్ అయినటువంటి ..దర్శకులు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  గారికి..ఈ విజన్ గురించి ఎంత పొగిడినా తక్కువే. కొన్ని మూస ధోరణుల నుండి తెలుగు సినిమాని బయటపడేశారు.

కొత్త మార్గాన్ని కూడా చూపించారు. ఫైనల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గ సినిమా మన తెలుగులో రూపొందడం అనేది నాకు గర్వంగా అనిపిస్తుంది. మన సాంస్కృతిక సున్నితత్వాలని వెండితెరపైకి తీసుకొచ్చిన గొప్ప దృశ్యకావ్యం ఇది” అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.