March 16, 202510:13:01 PM

Gangs Of Godavari: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగిందా? ప్లానింగా?

సినిమా సెట్స్‌ మీద ఉండగానే రెండో పార్టును, సీక్వెల్‌ను ప్రకటిస్తున్న రోజులివి. సినిమా మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అయితే కొంతమంది మాత్రం సినిమా ఆఖరున అంటే ఎండ్‌ టైటిల్‌ కార్డ్స్‌లో వేస్తుంటారు. అయితే పై తరహా పనులు ఏవీ చేయకుండా సినిమా సీక్వెల్‌ను ప్రకటించిన టీమ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి టీమ్స్‌లో ఇప్పుడు ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమా కూడా చేరింది. ఇటీవల ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ టైగర్‌ ఇక్కడితో ఆగడు.. ఇంకా చాలా దూరం వెళ్తాడు అని చెప్పాడు. ఇక దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya)  మాట్లాడుతూ తప్పకుండా మా లంకల మీతో మిగిలిపోతాడు. ఈ సినిమా ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఈ సినిమాకి సీక్వెల్‌ కచ్చితంగా చేస్తాం. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తాం అని చెప్పారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, సినిమా రిజల్ట్ బట్టి ప్రకటిస్తామని విడుదలకు ముందే విశ్వక్ సేన్ చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సినిమా రిలీజైన మొదటి రోజే సీక్వెల్‌ ప్రకటన చేసేశారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్లైమాక్స్‌లో ఏదైనా చెబుతారేమో అనుకున్నారంతా. కానీ థియేటర్లలో అలాంటి హింట్స్‌ ఏమీ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం అయితే.. సినిమాలో సీక్వెల్‌కు సంబంధించి లీడ్ సన్నివేశం పెట్టి, ఆఖరి నిమిషంలో తీసేశారని విశ్వక్‌సేన్‌ చెప్పాడు. అయితే సీక్వెల్ కోసం మరో బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నారట. లొకేషన్ కూడా మారుతుంది.

వేరే టైటిల్‌ కూడా పెడతారట. దీని కోసం ఓ ఈవెంట్‌ పెట్టి మరీ అనౌన్స్‌ చేస్తారట. మరి ఏ విధంగా సీక్వెల్‌ అవుతుంది అనేది విశ్వక్‌ చెప్పాలి. అయితే, సమాచారం ప్రకారం అయితే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఇలాంటి కథలను రన్‌ చేసే ఆలోచనల్లో ఉన్నారట. అంటే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ – – – ’ అంటూ టైటిల్‌ చివరన ఊరు పేర్లు, ప్రాంతం పేర్లు మారుతాయంట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.