March 17, 202503:24:05 AM

Kiara Advani: 21 ఏళ్లప్పుడు అనుకున్నా.. చేసేశా: కియారా కామెంట్స్‌ వైరల్‌.!

కియారా అడ్వాణీ (Kiara Advani) .. తెలుగులో చేస్తోంది ఒక్క సినిమానే అయినా ఆ ప్రాజెక్ట్‌ బరువు చాలా ఎక్కువ. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) – భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా అది. దీంతో ఎప్పుడెప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) సినిమా వస్తుందా? ఎప్పుడెప్పుడు కియారా గ్లామర్‌ను అస్వాదిద్దామని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అవును కియారా సినిమాల్లోకి వచ్చి దశాబ్దం అయింది.

2014లో ‘ఫగ్లీ’ అనే సినిమాతో కథానాయికగా మారిన ఆలియా అడ్వాణీ అలియాస్‌ కియారా అడ్వాణీ ఇటీవల తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కుటుంబంతో కలసి చూసే సినిమాల్లో భాగం కావడమే నా లక్ష్యం అని చెప్పిన కియారా.. నటిగా ఎదగాలనే లక్ష్యంతో 21 ఏళ్ల వయసులోనే కెరీర్‌ను ప్రారంభించాను అని గుర్తు చేసుకుంది.

కెరీర్‌ ప్రారంభంలో ఏం చేస్తున్నానో కూడా తెలియదు, ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు, అసలు ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో కూడా అవగాహన లేదు.. కానీ ఒక్కొక్కటిగా తెలుసుకున్నా, సినిమాలు చేశా, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా అని చెప్పింది కియారా. పదేళ్ల ప్రయాణంలో ఎలా పైకి ఎదగాలో నేర్చుకున్నాను, కథల ఎంపికలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను అని చెప్పింది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుందట కియారాకు.

ప్రేమ, కలలు, నవ్వులు, కన్నీళ్లు… ఇలా జీవితంలో అన్ని రకాల అనుభవాలను ఎదుర్కొన్నాను అని తన పదేళ్ల కెరీర్‌ గురించి మాట్లాడింది. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కాకుండా కియారా చేతిలో ‘వార్‌ 2’ సినిమా ఒక్కటే ఉంది. అయితే చాలా సినిమాలు చర్చల దశలో ఉన్నాయంటున్నారు. ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2) సినిమాలో కియారాతో ఐటెమ్‌ సాంగ్‌ చేయించాలనే ప్లాన్స్‌ జరుగుతున్నాయట. అయితే మరి ఆమె ఓకే అంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే అయితే ఆమెకు ఇదే తొలి ఐటెమ్‌ సాంగ్‌ అని చెప్పొచ్చు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.