April 14, 202511:11:37 AM

Mohan Babu: మా బావ ప్రభాస్ కు అభినందనలు.. మోహన్ బాబు రివ్యూ వైరల్!

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమాను చూసి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చిన సెలబ్రిటీల జాబితాలో తాజాగా మోహన్ బాబు (Mohan Babu) చేరారు. కల్కి సినిమాకు 1000 కోట్లు పక్కా అని పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్న తరుణంలో మోహన్ బాబు సైతం ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈరోజే కల్కి సినిమా చూశానని అద్భుతం మహాద్భుతం అంటూ ఆయన కామెంట్లు చేశారు.

మా బావ ప్రభాస్ కు (Prabhas) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు అని మోహన్ బాబు పేర్కొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ, భారతదేశం గర్వించదగ్గ సినిమాను అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఎక్స్ వేదికగా మోహన్ బాబు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మోహన్ బాబు అరుదుగా మాత్రమే సినిమాల గురించి స్పందించడం జరుగుతుంది. కల్కి సినిమా గురించి ఆయన ప్రశంసించడం అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

రెండు రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రావడం గమనార్హం. శనివారం, ఆదివారం కూడా బుకింగ్స్ పరంగా ఈ సినిమా టాప్ లో ఉండటం కొసమెరుపు. కన్నప్ప (Kannappa) సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సక్సెస్ తో త్వరలో ఈ సినిమాకు సంబంధించి కూడా అదిరిపోయే అప్ డేట్స్ రానున్నాయి.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ రోల్ ఏ విధంగా ఉందబోతుందో అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.